NZB: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో ఈ నెల 26న హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రాములు తెలిపారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశానుసారం ఈ ప్రక్రియను ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. హుండీల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా హాజరుకానున్నట్లు తెలిపారు.