VZM: ప్రభుత్వ పరీక్షల సంచాలకుల విభాగం ( అమరావతి) ఆదేశాల ప్రకారం మార్చి 16 నుంచి జరిగే పదవతరగతి టైం టేబుల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యం నాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటుందన్నారు.