SRCL: తాగుడుకు బానిసైన కన్నతండ్రిని ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపిన తనయుడిని ముస్తాబాద్ SI గణేష్ శనివారం అరెస్ట్ చేశారు. గూడెం గ్రామానికి చెందిన పిట్టల దేవయ్య మృతి చెందగా అన్న మృతిపై తమ్ముడు లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి పరువు తీస్తున్నందున తానే చంపినట్లు కొడుకు ఒప్పుకున్నాడు.