టీ చేసిన తర్వాత టీ ఆకులను చాలా మంది పడేస్తుంటారు. అయితే వాటితో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు కేశాలను మృదువుగా మెరిసేలా చేస్తాయి. అలాగే మొక్కలకు ఎరువుగా, ఫ్రిజ్లోని దుర్వాసనను తొలగించడానికి, చీమల నివారణకు కూడా వాడుకోవచ్చు. మొండి మరకలపై రుద్దితే అవి తొలగిపోతాయి.