HNK: కలెక్టరేట్‌కు విద్యారంగ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు దాడి చేసి, అరెస్టు చేయడం హేయకరమని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు కునుసోతు మురళి నాయక్ అన్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయని, వాటిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.