KMM: కాంగ్రెస్లో ఈసారి నగర కమిటీలకు బదులు కార్పొరేషన్ అధ్యక్షులను నియమించారు. ఈమేరకు ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షుడిగా నాగండ్ల దీపక్ చౌదరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన నగర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. పార్టీ విద్యార్థి సంఘం నుంచి కార్యదర్శిగా, నగర కార్యదర్శిగా, బీ-బ్లాక్ అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.