NZB: జీవితాంతం కలిసి బతికిన భార్యా భర్తలు చావును కూడా పంచుకున్నారు. మోపాల్ మండలం కుల్సాపూర్ తండాకు చెందిన లకావత్ మురుభాయి(90) నిన్న ఉదయం 3 గంటలకు చనిపోయింది. అనారోగ్యంతో ఉన్న ఆమె భర్త తావుర్య ఆమె చావును తట్టుకోలేక నిన్న సాయంత్రం 7గంటలకు మృతిచెందాడు. భార్యా భర్తలు ఇద్దరూ ఒకేరోజు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.