SKLM: లావేరు ఎస్సైగా కొండపల్లి అప్పల సూరి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన జి .లక్ష్మణరావును ఎచ్చెర్ల ఎస్సైగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో మన్యం జిల్లాలో ఎస్సైగా పనిచేస్తూ అప్పల సూరి లావేరు కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఎస్సైకు సిబ్బంది అభినందనలు తెలిపారు. శాంతిభద్రతలు పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై అన్నారు.