సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా నేడు ఆదివారం సాయంత్రం హిల్ వ్యూ స్టేడియంలో అద్భుత సంగీత ప్రదర్శన జరగనుంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రేగ్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా బృందం ఈ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ కార్యక్రమం భక్తులందరికీ కనువిందు చేసి, మరపురాని అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు.