ప్రకాశం: పెద్దపులి పదేపదే సంచరిస్తూ రైతులు, పశువుల కాపలాదారులును భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటన దోర్నాల మండలం బొమ్మలాపురంలో జరుగుతోంది. బొమ్మలాపురం గండిచెరువు సమీపంలోని తుంగుడు అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి దాడిచేసి కోడె దూడను చంపేసింది. ఇప్పటికే పెద్దపులి 20 ఆవులతోపాటు లేగదూడలను హతమార్చినట్లు పశువుల కాపలాదారులు చెబుతున్నారు.