MBNR: శనివారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో పాత రిజిస్టర్ ఆఫీస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కొన ఊపిరితో కనిపించాడు. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్‌లో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే ఆసుపత్రికి రావాలని స్థానిక కాలనీవాసులు కోరారు.