HYD: మరో రెండున్నర నెలల్లో జీహెచ్ఎంసీ పాలకమండలి ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి మాత్రం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో చివరి సమావేశం కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు మధ్య మాటల యుద్ధం తప్పకపోవచ్చని సమాచారం.