W.G: పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యాధికారులు పని చేయాలని, అప్పుడే పేదవారికి ఆరోగ్య భద్రత చేకూరుతుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం పాలకొల్లు ప్రాంతీయ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. ప్రసూతి వార్డు, పురుషుల వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. పిల్లలు కొట్లాట కారణంగా కంటికి దెబ్బ తగిలిన తోత్తరమూడి మనోజ్‌ను పరామర్శించారు.