ATP: గుత్తి ఆర్ఎస్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న స్వప్న మాక్ అసెంబ్లీకు ఎంపికైనట్లు ఎంఈవో రవి నాయక్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి విద్యార్థి స్వప్న పాల్గొంటుందన్నారు. దీంతో స్వప్నకు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.