KRNL: ఆదోని మండలం ఢనాపురం గ్రామాన్ని ఎమ్మెల్యే వీరుపాక్షి ఇవాళ సందర్శించారు. గ్రామంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజలను గ్రామాభివృద్ధి, సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అభివృద్ధి పనుల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.