KDP: పోరుమామిళ్ల సీఐగా బాధ్యతలు చేపట్టిన హేమ సుందర్ రావును కాశినాయన మండలం సొసైటీ బ్యాంక్ ఛైర్మన్ మురికిటి చిన్న గురివిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. మండలంలో నెలకొన్న పలు సమస్యల గురించి వివరించారు. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆయన కోరారు.