బంగ్లాదేశ్ సీనియర్ బౌలర్ తైజుల్ ఇస్లాం భారీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఆ దేశం తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు(249) తీసిన ప్లేయర్‌గా షకిబ్ అల్ హసన్(246)ను అధిగమించాడు. 209 వికెట్లతో మెహిదీ మిరాజ్ 3వ స్థానంలో ఉన్నాడు. కాగా ఐర్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో తైజుల్ మరో వికెట్ తీస్తే.. బంగ్లా తరఫున 250 టెస్టు వికెట్లు పడగొట్టిన తొలి, ఏకైక బౌలర్‌గా నిలుస్తాడు.