MDK: పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో మంటల్లో చిక్కుకుని బగుడం నర్సింలు (47) మృతి చెందాడు. వరి కొయ్యలు కాల్చుతుండగా మంట పక్క పొలాలకు వ్యాపించడంతో ఆర్పేందుకు ప్రయత్నించాడు. కాలు సమస్యతో వేగంగా కదలలేక మంటల్లో ఇరుక్కుని తల, శరీరానికి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. భార్య సులోచన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.