VSP: తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని శనివారం రాత్రి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చక్రాల కింద పడటంతో తల నుజ్జునుజ్జయింది. మృతుడి వయస్సు 70 సంవత్సరాలు వయసు పైబడి ఉంటుంది. సమాచారం అందుకున్న ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలు ఆరా తీస్తున్నారు.