SRD: నారాయణఖేడ్ పట్టణంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ నేడు జరుగుతుందని ఐకేపీ సీసీ సాయిలు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి చేతుల మీదుగా మహిళ సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా సభ్యులు హాజరై ఇందిరా మహిళా శక్తి చీరలను పొందాలని ఆయన కోరారు.