ELR: అర్హులైన ప్రతి ఒక్కరూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలుగు రైతు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు కోరారు. శనివారం చాట్రాయి మండలం, చనుబండలోని సచివాలయంలో జరిగిన ఉపాధి హామీ సభలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా మంజూరు చేసే ప్రభుత్వ గృహాల నిర్మాణానికి కూడా జాబ్ కార్డు అవసరం ఎంతైనా ఉందని వివరించారు.