KRNL: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా నిబద్ధతతో, నిజమైన సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు. తెలంగాణకు చెందిన మర్రి చెన్నారెడ్డి సంస్థలో శిక్షణ పొందుతున్న 16 మంది యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరిపాలనలో మానవీయ దృష్టికోణం ఎంతో ముఖ్యమని, ప్రజలకు అందించే ప్రతి సేవలో అది ప్రతిఫలించాలన్నారు.