MBNR: కార్తీక మాసం అనంతరం జిల్లాలో ఇవాళ చికెన్ ధరల్లో స్వల్పంగా మార్పులు ఉన్నట్లు కనిపిస్తోంది. కేజీ చికెన్ (విత్ స్కిన్) రూ. 235, స్కిన్ లెస్ రూ. 258గా అమ్ముతున్నారు. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద మాంసప్రియుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం పూర్తి కావడంతో అధిక సంఖ్యలో కొనుగోళ్లు అవుతున్నాయి. అయితే, ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారస్థులు చెబుతున్నారు.