W.G: పాండిచ్చేరి విశ్వవిద్యాలయం కోర్టు సభ్యునిగా తాడేపల్లిగూడెం ఏపీ నీట్ ప్రొఫెసర్ రవికిరణ్ శాస్త్రీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన నిట్లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విశ్వవిద్యాలయ సందర్శకులు నామినేట్ చేసినట్లు శనివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.