VZM: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులకు విజయనగరం ఎక్సైజ్ కోర్టు జడ్జి మొదటి ముద్దాయికి ఐదురోజులు జైలుశిక్ష, విధించినట్లు తెలిపారు. మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తం ముగ్గురికి రూ. 30,000 జరిమానా విధించినట్లు డెంకాడ ఎస్సై సన్యాసినాయుడు శనివారం పేర్కొన్నారు. వివరాల మేరకు స్థానిక కూడలిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం సేవించి పట్టుబడ్డారన్నారు.