PPM: పరిశుభ్రత, ఆరోగ్యకర జీవనశైలితో వ్యాధులు దరి చేరవని జిల్లా ఎన్.సీ.డీ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు పేర్కొన్నారు. వెంకంపేట గ్రామంలో వైద్య బృందంతో కలిసి శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి, ఆరోగ్య సమాచారం అందుతున్న సేవలపై వారిని అడిగి తెలుసుకున్నారు. సంచార చికిత్స శిబిరం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పక్కగా తనిఖీలు నిర్వహించాలన్నారు.