మేడ్చల్: బాలానగర్ వంతెన నుంచి మూసాపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ఈ పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో కార్యాలయాలకు వెళ్లడానికి గంటల సమయం వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నట్లు వాహనదారులు వాపోయారు. ప్రభుత్వ యంత్రాంగం ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.