అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పాత మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ గురువారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించి ఆ స్థలంలో నూతన భవనాలు నిర్మిస్తే పోలీస్ శాఖకు ఉపయోగంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం సిబ్బంది క్వార్టర్స్, ఖాళీ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు.