AP: నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతోందని మాజీ సీఎం జగన్ తెలిపారు. ‘ఐదేళ్లలో మెడికల్ కాలేజీలకు 5వేల కోట్లు ఖర్చు చేయలేరా?. ఉచితంగా వైద్యం చేసే కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు. అమరావతిలో లక్షకోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. మెడికల్ కాలేజీలకు 5వేల కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడుతోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.