WGL: జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం తెలంగాణ BC ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ కులాలను అణగదొక్కే కుట్రలను తిప్పికొట్టేందుకు బీసీ, ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. శుక్రవారం (రేపు) జరిగే తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని, అందరూ సహకరించాలని కోరారు.