TG: BC రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం తేటతెల్లమైందని అన్నారు. ఇన్నాళ్ల పాటు అడ్డగోలు విధానాలతో 42శాతం హామీ తుంగలో తొక్కారని విమర్శించారు. ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. న్యాయస్థానంలో నిలబడని జీవోతో మభ్యపెట్టారని మండిపడ్డారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల ఎన్నికల వాయిదా కోసమే బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ వాడుకుందన్నారు.