సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత బ్యాటర్ రిచా ఘోష్ 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసింది. దీంతో వన్డేల్లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే, స్నేహాతో 8వ వికెట్‌కు 88 రన్స్ జోడించి, ఈ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం జాబితాలో 4వ స్థానంలో నిలిచింది.