RR: ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ లో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోయిందని విమర్శించారు.