NLG: లంచం తీసుకుంటూ ఎట్టుబడ్డ చిట్యాల తహసీల్దార్ కృష్ణను, సహకరించిన రమేష్‌ను ఏసీబీ అధికారులు ఇవాళ రాత్రి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. గుండ్రంపల్లి గ్రామంలో 172 సర్వేనెంబర్‌లోని వ్యవసాయ భూమి మ్యుటేషన్ ప్రక్రియకు, స.నం. 167 సర్వే రిపోర్టును చిట్యాల ఎస్సై సమర్పించేందుకుగాను ఆయన లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.