VKB: ఆపద సమయంలో మహిళలు, బాలికలకు షీ టీం, డయల్ 100 అండగా ఉంటుందని SI పుష్పలత రెడ్డి తెలిపారు. తాండూరు నెంబర్-1 ప్రభుత్వ పాఠశాలలో జిల్లా SP నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల బయట ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులకు గురిచేస్తే సమాచారం అందించాలని చెప్పారు. బాల్యవివాహాలు చేసుకోవద్దని, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు.