KMM: ఖమ్మంలోని గిరి ప్రసాద్ భవన్లో గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేగువేరా 58వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటిక్యాల రామకృష్ణ చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేగువేరా స్ఫూర్తితో విద్యార్థులు విద్యా రంగంలోని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.