ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ పార్టీని బలోపేతం చేయడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉమామహేశ్వరనాయుడు అన్నారు. కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎంపికైన ఉమామహేశ్వర నాయుడును మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ బిక్కిహరి, పలువురు వైసీపీ నాయకులు సన్మానించారు.