NLR: సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కళాకారులు తోటపల్లి గూడూరులో జాతా నిర్వహించారు. శనివారం, ఆదివారం జరగనున్న సీఐటీయూ మహాసభల సందర్భంగా ఈ జాతా నిర్వహిస్తున్నట్లు నాయకులు రాజా తెలిపారు. ఇందులో ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొని పాటలు, ఆటలతో అలరిస్తూ ప్రచారం చేశారు. ఈ జాతాను సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు.