అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి, రోడ్లు, మౌలిక వసతులు, పౌర అవసరాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.