SKLM: కళ్లు మనకు దేవుడిచ్చిన అపురూపమైనదని, వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మనదేనని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి.సింధూర అన్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కెఎల్. నాయుడు కంటి వైద్యశాలలో,లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రముఖ కంటివైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించారు.