ప్రకాశం: మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట సహదిత్ త్రివినాగ్ బదిలీ అయ్యారు. గురువారం రాష్ట్రంలో భారీ ఎత్తున అఖిలభారత సర్వీస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా మార్కాపురం సబ్ కలెక్టర్ కూడా బదిలీ అయ్యారు. ఆయనను గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.