WGL: జిల్లా వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో గురువారం సమాచార హక్కు చట్టం-2005 పై ‘ఆర్టీఐ ద్వారా సుపరిపాలన’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రంగశాయిపేట, కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించి, విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆర్టీఐ చట్టం ప్రజలకు సమాచారం పొందడంలో అస్త్రంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.