కోనసీమ: కాట్రేనికోనలో నిర్మితమవుతున్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులు ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గురువారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత పేదవాడి ఆకలి తీచ్చేందుకు అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే క్యాంటీన్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలిపారు.