మేడ్చల్: శామీర్పేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు మాజీద్ పూర్లో 7 రోజుల గ్రామ శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాన్ని కమిషనర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో వాలంటీర్లు చురుకుగా పాల్గొనాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత గ్రామాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.