NRPT: సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న బీజేపీ ఎస్టీ మోర్చా నేతలను నారాయణపేట రూరల్ పోలీసులు గురువారం ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. మద్దూరు మండలం బోడమర్రి తాండాకు చెందిన పాత్లావత్ రమేష్ నాయక్ మోసపోయి సూసైడ్ నోట్ రాసి అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరపాలన్నారు.