అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లి మండలం రౌతు బాబు తన భార్య రౌతు సావిత్రిని హత్య చేసిన కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1. 70 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ఈ మేరకు 2021లో ఫిర్యాదు నమోదు చేయబడిన ఈ కేసును రాయచోటి ఎస్ ఎస్ డీపీవో పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు. కాగా, VII ADJ కోర్టు కడప న్యాయమూర్తి జి. ఎస్. రమేష్ కుమార్ విచారణ అనంతరం ఈ తీర్పును వెలువరించారు.