MBNR: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని మిడ్జిల్ మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పట్నం బంగారు పిలుపునిచ్చారు. గురువారం లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా జరిగిన ముఖ్య నేతల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.