HYD: లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మౌలిక అనే 20 ఏళ్ల యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఈ యువతి, మాణికేశవ్ నగర్ కు చెందిన అంబాజీ నాయక్ అనే యువకుడి వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై లాలాగూడ పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.