W.G: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం ఆరుళ్ల గ్రామాల మధ్య వాహనదారులపై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ దాడిలో నందమూరు నుంచి తాడేపల్లిగూడెం వైపు వస్తున్న జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్ వాహనం ధ్వంసమైంది. వెంటనే వారు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు.