TG: రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లకు పరిమితి లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది రవివర్మ హైకోర్టులో వాదనలు వినిపించారు. రిజర్వేషన్లలోకి రాని పౌరుల హక్కులకు.. భంగం కలగకూడదనే సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. TGలో మొత్తం రిజర్వేషన్లు 67 శాతం ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఏ రిజర్వేషన్లు లేని జనాభా 15 శాతమే ఉందన్నారు. వారికి మిగిలిన 33 శాతం సీట్లు ఇస్తున్నామన్నారు.